Wednesday, January 22, 2025

ఎన్నికలకు పటిష్ట భద్రత.. 1,600 మంది రౌడీ షీటర్ల బైండోవర్

- Advertisement -
- Advertisement -

1,600 మంది రౌడీషీటర్ల బైండోవర్
48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి
2లక్షల వాహనాలు తనిఖీ చేశాం
సమస్య వస్తే డయల్ 100కు ఫోన్ చేయండి
హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యా

మనతెలంగాణ, సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2,400 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని 7జోన్లలో ఉన్న 1,600మంది రౌడీషీటర్లు ఉన్నారని, వారిని బైండోవర్ చేసి నిఘా పెట్టామని తెలిపారు.

రానున్న 48 గంటల పాటు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో 2లక్షల వాహనాలను తనిఖీ చేశామని తెలిపారు. ప్రయాణాలు చేసే వారు పోలీసులు ఆపినప్పుడు సరైన పత్రాలు చూపించాలని కోరారు. రాజకీయ నాయకులు ఏదైనా సమస్య సృష్టిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని, డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 666 సున్నిత ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. హైదరాబాద్ ప్రజలు ఓటింగ్ శాతం పెంచాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. 370 మొబైల్ యూనిట్లు ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలిపారు. ఎన్నికల విధుల్లో పోలీసులు తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News