Wednesday, January 22, 2025

ఎన్నికలకు పటిష్ట భద్రత

- Advertisement -
- Advertisement -

స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ రంగంలోకి
ఎన్నికల అధికారులతో హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యా సమావేశం

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టిఎస్ ఐసిసిసి)లో గురువారం జరిగిన సమావేశంలో జిహెచ్‌ఎంసి కమిషనర్, ఎన్నికల అధికారి రోనాల్ రోస్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా మాట్లాడుతూ నిఘా కోసం వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్‌లలో మైక్రో అబ్జర్వర్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను రవాణా చేసే వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) కీలకమైన పోలింగ్ స్టేషన్‌ల వద్ద మోహరిస్తున్నామని తెలిపారు. 391-రూట్ మొబైల్‌లు, ఒక్కొక్కటి 3 సాయుధ సిబ్బంది, పిసి ఉంటారని తెలిపారు. 129 పెట్రోలింగ్ వాహనాలు, 220 బ్లూ కోల్ట్‌లు, 122 ఇతర వాహనాలు డయల్ 100 కాల్‌లకు తక్షణమే స్పందించడానికి, ఏవైనా సంఘటనలు తలెత్తితే వెంటనే చేరుకునేందుకు సిద్ధంగా ఉంటాయని తెలిపారు.

స్టాటిక్ పికెట్లతో పాటు 45 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 45 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలతో కూడిన నెట్‌వర్క్ పనిచేస్తోందని తెలిపారు. 28 మంది ఏసీపీలు, 7 మంది డీసీపీ ర్యాంకు అధికారులతో కూడిన స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను రంగంలోకి దించనున్నట్లు తెలిపారు. తొమ్మిది టాస్క్‌ఫోర్స్ బృందం, ప్రత్యేక బలగాల 9 బృందాలు, 71 మంది ఇన్‌స్పెక్టర్లతో పాటు 125 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు క్యూఆర్‌టీగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు గుమనించాలని కోరారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లు ఇళ్లకు వెళ్లిపోవాలని, గుమ్మిగూడవద్దని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ) అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కనీసం ఒక ఉమెన్ పిసిని మోహరిస్తామని తెలిపారు. బహుళ అంచల భద్రతను ఏర్పాటు చేశామని, – ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును ఎటువంటి ఆటంకాలు లేకుండా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈసి పరిశీలకులు ఆ ప్రాంతంతో బాగా పరిచయం ఉన్న స్థానిక వ్యక్తిని మోహరించాలని సిఫార్సు చేశారని, వీరికి స్థానికుల గురించి పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ విక్రం సింగ్‌మాన్, జాయింట్ సిపి విశ్వప్రసాద్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జాయింట్ సిపి పరిమళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News