Wednesday, November 20, 2024

రెండు ఆడ పులుల మధ్య ఘర్షణ.. పులి మృతి

- Advertisement -
- Advertisement -

కాగజ్‌నగర్: అటవీలో పులుల ఆధిపత్యం ఉంటుందని ఈ కారణంగానే రెండు ఆడ పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఆడ పులి చనిపోయి ఉంటుందని రాష్ట్ర అటవీ శాఖ అధికారి శాంతారామ్ అన్నారు. కుమ్రం భీం జిల్లా, కాగజ్‌నగర్ మండలం, దరిగాం ఆటవీ ప్రాంతంలో గత ఐదు రోజుల క్రితం ఆడ పులి మృతిపై ఆదివారం కాగజ్‌నగర్ డివిజన్ అటవీ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు ఆడ పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకటి మృతి చెందగా, మరొకటి గాయపడి ఉండి ఉంటుందని తెలిపారు. మృతి చెందిన ఆడ పులి మృతదేహం ప్రధాన భాగాలను స్థానిక పశు వైద్యాధికారి విజయ్‌కుమార్‌చే పోస్టుమార్టం నిర్వహించి, హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు.

అడవుల్లో పులుల ఆధిపత్య ప్రాంతాలు ఉంటాయని, ఒక పులి ఆధిపత్య ప్రాంతంలోకి మరో పులి వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని సిసిఎఫ్ వివరించారు. సుమారు 200 మీటర్ల విస్తీర్ణంలో ఈ రెండు పులులు ఘర్షణ పడి కోట్లాడి ఉంటాయని తెలిపారు. మృతి చెందిన ఆడపులి 18 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటుందని అన్నారు. అలాగే కోట్లాటలో మరో ఆడ పులి 2 సంవత్సరాలపైన వయస్సు కలిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ ఆధికారి నీరజ్ కుమార్, స్థానిక ఆటవీ ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News