Wednesday, January 22, 2025

భారత్‌లో ఉద్యోగులందరినీ తొలగించిన టిక్‌టాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా కారణాలతో 2020లో భారత్‌లో నిషేధానికి గురయిన టిక్‌టాక్ తాజాగా దేశంలో మొత్తం సిబ్బందిని విధులనుంచి తొలగించింది. భారత్‌లో టిక్‌టాక్‌కు అధిక యూజర్లున్నారు. భారత్‌నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని చేస్తున్న మొత్తం ఉద్యోగులపై టిక్‌టాక్ వేటు వేసింది. భారత్‌లో టిక్‌టాక్ నిషేధానికి గురయిన మూడేళ్ల తర్వాత బైట్‌డ్యాన్స్‌కు చెందిన సోషల్ మీడియా యాప్ భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఇంటికి పంపించింది. భారత్‌లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్పటికీ టిక్‌టాక్ ఇప్పటికీ భారత్‌లో కార్యాలయాన్ని కొనసాగిస్తోంది.

భారత్ కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయి మార్కెట్ల కోసం పని చేస్తున్నారు. ఇక భారత్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు టిక్‌టాక్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా అమెరికాలోను యాప్ భవిష్యత్తుపై సందిగ్ధం నెలకొంది. తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్‌టీమ్‌కు సపోర్టుకోసం 2020లో భారత్‌లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్ట్ హబ్‌ను మూసివేయాలని నిర్ణయించినట్లు టిక్‌టాక్ ప్రతినిధి ఒకప్రకటనలో తెలియజేశారు. ఫిబ్రవరి 28 కంపెనీలో మీ చివరి రోజని ఉద్యోగులకు కంపెనీ తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News