Wednesday, April 9, 2025

తిలక్ వర్మ నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ టి20 ఫార్మాట్‌లో నయా చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో తిలక్ చివరి రెండు టి20లలో శతకాలతో చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా భారత దేశవాళీ క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్ మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 67 బంతుల్లోనే 10 సిక్సర్లు, మరో 14 ఫోర్లతో 151 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ 248 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ 69 పరుగులకే కుప్పకూలి 179 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News