Sunday, December 22, 2024

తిలక్‌వర్మ జాక్‌పాట్

- Advertisement -
- Advertisement -

టి20లో మూడో ర్యాంక్
దుబాయి: అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ సంచలనం, హైదరాబాదీ తిలక్‌వర్మ జాక్‌పాట్ కొట్టేశాడు. ఐసిసి బుధవారం ప్రకటించిన తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిలక్ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో తిలక్ వరుసగా రెండు శతకాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచిన తిలక్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు.806 రేటింగ్ పాయింట్లతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాపై తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. నాలుగు మ్యాచుల్లో 198 స్ట్రైక్‌రుట్‌తో రికార్డు స్థాయిలో 280 పరుగులు సాధించాడు. దీంతో ర్యాంకింగ్స్ తిలక్‌వర్మ టాప్3కి చేరుకున్నాడు. మరోవైపు సిరీస్‌లో పేలవమైన ఫామ్‌తో నిరాశపరిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ 855 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కొంతకాలంగా హెడ్ టి20 ఫార్మాట్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ స్టార్ ఫిల్ సాల్ట్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక సౌతాఫ్రికా సిరీస్‌లో రెండు శతకాలతో అదరగొట్టిన మరో భారత ఆటగాడు సంజు శాంసన్ కూడా తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News