స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. అలాగే ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఈ సీక్వెల్ తో మొదటి భాగానికి రెట్టింపు వినోదాన్ని అందిస్తామని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ’టిల్లు స్క్వేర్’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
‘టిల్లు‘ ఫిల్మ్ ఫ్రాంచైజీ నుండి వస్తున్న ఈ చిత్రం మరో భారీ బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉందని ట్రైలర్‌తో స్పష్టమైంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె, పక్కింటి అమ్మాయిలా ఉంటుందనే తన ఆన్-స్క్రీన్ ఇమేజ్‌ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అనుపమ పరమేశ్వరన్ లుక్స్‌తో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్, సిద్ధూతో ఆమె కెమిస్ట్రీ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.