Thursday, January 23, 2025

టిమ్ సిఫర్ట్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీని వెంటాడుతున్న కొవిడ్ కేసులు

Tim seifert tests positive for covid19

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను కరోనా ఇప్పట్లో వదిలిపెట్టేటట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఢిల్లీ జట్టులో ఓ క్రికెటర్‌తో సహా పలువురు సహాయక సిబ్బంది కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. జట్టు ఫిజియో ఫర్హత్‌తో సహా పలువురికి కరోనా సోకింది. దీంతో ఢిల్లీ జట్టు మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. అంతేగాక స్టార్ ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ కూడా కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా ఢిల్లీకే చెందిన మరో క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌కు వచ్చింది. న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సిఫర్ట్ కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో ఢిల్లీ జట్టులో ఆందోళన మరింత పెరిగింది. సిఫర్ట్‌తో కలిపి మొత్తం ఆరుగురు జట్టు సభ్యులు కరోనా బారిన పడ్డారు.

ఇదిలావుండగా పలువురు సహాయక సిబ్బంది, ఇద్దరు క్రికెటర్లు కరోనా బారిన పడినా బుధవారం పంజాబ్‌తో మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగింది. పలు జాగ్రత్తల నడుమ నిర్వాహకులు మ్యాచ్‌ను నిర్వహించారు. నిజానికి ఢిల్లీపంజాబ్‌ల మధ్య మ్యాచ్ పుణెలో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా మ్యాచ్ వేదికను ముంబైకి మార్చారు. అంతేగాక రాజస్థాన్‌తో ఢిల్లీ ఆడే మ్యాచ్‌ను కూడా ముంబైలోనే నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కరోనా కేసుల నేపథ్యంలో ఢిల్లీ జట్టు సభ్యులను హోటల్‌కే పరిమితం చేశారు. మ్యాచ్ సమయంలో మాత్రమే వారు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. కఠినమైన బయోబబుల్ నిబంధనల మధ్య ఢిల్లీ ఆటగాళ్లు ప్రస్తుతం ఉన్నారు. వారం రోజుల పాటు ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితి తప్పెలా లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News