Monday, December 23, 2024

పాస్‌పోర్టు సేవలకు సమయం కుదింపు

- Advertisement -
- Advertisement -
Time compression for passport services
ఈ నెలాఖరు వరకు పరిమిత సంఖ్యలోనే పాస్‌పోర్టు సేవలు
సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య

హైదరాబాద్ : ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ పరిధిలోని కేంద్రాల్లో కోవిడ్- వైరస్ వ్యాప్తి నివారించేందుకు 50 శాతంతో కార్యకలాపాలను ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. పిఎస్‌కె, పిఎస్‌ఎల్‌కె, పిఓపిఎస్‌కెలలో నిర్వహించే అపాయింట్‌మెంట్‌ల సంఖ్య తగ్గిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్-పరిస్థితి నేపథ్యంలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దృష్టా పాస్‌పోర్ట్ సేవల్లో నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రం, పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో కోవిడ్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో పబ్లిక్ ఎంక్వైరీ కౌంటర్ పని చేస్తుందన్నారు. ఈ నెలాఖరు వరకు ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సేవలను అందించనున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News