Friday, December 27, 2024

‘టైం ఇవ్వు పిల్ల’ లిరికల్ వీడియో వచ్చేసింది…

- Advertisement -
- Advertisement -

 

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం ’18 పేజిస్’. నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్ర టీజర్, “నన్నయ్య రాసిన” అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను వదిలారు. శ్రీమణి రచించగా, తమిళ స్టార్ హీరో శింబు పాడిన “టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు” అనే సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇదివరకే ఎన్టీఆర్ ‘బాద్ షా’కి “డైమెండ్ గర్ల్”, మంచు మనోజ్ ‘పోటుగాడి’కి “బుజ్జి పిల్ల”, యంగ్ హీరో రామ్ పోతినేని ‘వారియర్’కి “బుల్లెట్ సాంగ్”ను పాడిన శింబు.. ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న 18పేజిస్ కోసం “టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు” అనే పాటను పాడాడు. వాటి మాదిరిగానే ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వబోతుందని అర్ధమవుతుంది. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారిక ప్రకటన చేసారు.

‘Time Ivvu Pilla’ Song out from ’18 Pages’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News