Wednesday, January 22, 2025

కెజిబివి సిబ్బందికి టైం స్కేల్ వర్తింపజేయాలి

- Advertisement -
- Advertisement -
మంత్రి సబితకు పిఆర్‌టియుటిఎస్ విజ్ఞప్తి

హైదరాబాద్ : కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి కనీస మూల వేతనాన్ని అమలు చేయాలని పిఆర్‌టియుటిఎస్ ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం మంత్రి సబితకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావ, ఎంఎల్‌సి కూర రఘోత్తం రెడ్డి, మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని పిఆర్‌టియుటిఎస్ నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా కె.జి.బి.వి.లలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా మోడల్ స్కూల్స్ హాస్టల్ అదనపు బాధ్యతలను త్వరలోనే తొలగిస్తామని, కె.జి.బి.వి.లలో కేర్ టేకర్లను నియమిస్తామని, ఫైనాన్షియల్ గైడ్‌లైన్స్ సవరిస్తామని, బియ్యం నేరుగా పాఠశాలకు సరఫరా చేస్తామని, ప్రత్యేక అధికారిణి పేరును ప్రిన్సిపాల్‌గా మారుస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. మినిమం టైం స్కేల్ వర్తింపు విషయంలో అదనపు బడ్జెట్ వివరాలను ముఖ్యమంత్రికి అందించాలని కోరగా సంఘం తరపున ఆ వివరాలు అందించారు. మంత్రిని కలిసినవారిలో కె.జి.బి.వి. ప్రతినిధులు ఝాన్సీ, మాధవి, సబిత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News