Monday, December 23, 2024

క్రీడలకు సమయాన్ని కేటాయించాలి : ఎమ్మెల్యే రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

అల్వాల్ : టీం సాయి స్పోరట్స్ ఉత్సవ్‌లో భాగంగా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్లు ముగిశాయి. ఫైనల్ లో పవర్ రేంజర్, సంతోష్ వారియర్ పై గెలిచి కప్పును కైవసం చేసుకున్ది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు హాజరయారు. వీరితోపాటు మల్కాజిగిరి కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, శ్రావణ్ కుమార్, జిల్లా నేతలు వికె మహేష్, నరసింహ గౌడ్, రవి కిరణ్, అజిత్, సాయి, టీం సాయి బృందం అతిథులను ఘనంగా సత్కరించి మెమెంటో ప్రదానం చేశారు.

రఘునందన్ రావు మాట్లాడుతూ టీం సాయి చేస్తున్న సోర్ట్ ఉత్సవం నిర్వాహకులను అభినందించారు. క్రీడాకారుల నైపుణ్యమును వెలుగు తీసే ఇలాంటి టోర్నమెంట్లు ముందు ముందు మరిన్ని నిర్వహించాలని ఆయన కోరారు. ప్రతి యువకుడు క్రీడలకు కొంత సమయం కేటాయించి క్రీడా స్ఫూర్తిని బయటకి తేవాలని యువకులను కోరారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News