Monday, December 23, 2024

కనుమరుగు కానున్న ట్విట్టర్ పిట్ట!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లోగోనుంచి పక్షి మాయమవుతుందని దాని యజమాని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కొన్నేళుల్గా ట్విట్టర్‌కు ఆ పక్షి లోగా ప్రధాన చిహ్నంగా ఉన్న విషయం తెలిసిందే. లోగో మార్పు విషయాన్ని మస్క్ ఆదివారం ట్విట్టర్‌లో వెల్లడించారు. ట్విట్టర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన‘ ఎక్స్‌కార్ప్’లో విలీనం చేయనున్నట్లు కొన్నాళ్ల క్రితం మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.‘ త్వరలోనే మేము ట్విట్టర్ బ్రాండ్‌కు.. ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం.

ఈ రాత్రి పోస్టు చేసిన ‘x’ లోగో బాగుంటే రేపటినుంచే అది అమలులోకి వస్తుంది’అని మస్క్ ట్వీట్ చేశారు. మస్క్ ట్విట్టర్‌ను గత ఏడాది కొనుగోలు చేసిన తర్వాత అతిపెద్ద మార్పు ఇదేనని చెప్పవచ్చు. మస్క్‌కు ‘x’ అక్షరం చాలా ఇష్టం.ఈ విషయం కొత్తేమీ కాదు.ట్విట్టర్ సిఇఓగా లిండా యాకరీనో బాధ్యతలు స్వీకరించిన సమయంలో కూడాకంపెనీని ఎవ్రీథింగ్ యాప్ ఎక్స్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని మస్క్‌ట్వీట్ చేశారు. ఇక ట్విట్టర్‌లోని అన్‌వెరిఫైడ్ ఖాతాలనుంచిప్రత్యక్ష సందేశాలు ఉంచడాన్ని పరిమితం చేస్తున్నటట్లు మస్క్ శనివారం ప్రకటించారు.

‘ డైరెక్ట్ మెస్సేజిల స్పామ్‌ను తగ్గించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ వెరిఫైడ్ భవిష్యతుత్తులోపరిమిత సంఖ్యలోనే డిఎంలు( డైరెక్ట్ మెస్సేజిలు) చేయగలరు. నేడే సబ్‌స్ర్కైబ్ చేసుకొని ఎక్కువ మెస్సేజిలు పంపండి’ అని ట్విట్టర్ పేర్కొంది.కాగా ట్విట్టర్‌లో తొలినుంచి మస్క్ చేస్తున్న మార్పులకు మిశ్రమ స్పందన వస్తున్న విషయం తెలిసిందే. అలాగే లోగో మార్పు విషయంలో మిశ్రమ స్పందన కనిపించింది. ట్విట్టర్ లోగో మార్పు కోసం ఎదురు చూస్తున్నామని కొందరు ట్వీట్ చేస్తే, అలాంటి సోరపాటు చేయవద్దని మరి కొందరు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News