Wednesday, January 22, 2025

‘మత్తు వదలరా2’ శుద్ధ దండగ సినిమా!

- Advertisement -
- Advertisement -

‘మత్తు వదలరా2’ సినిమా సెప్టెంబర్ 13న విడుదల అయి, థియేటర్లలో ఆడుతోంది. ఇదో కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అని చెప్పుకుంటున్నప్పటికీ పరమ వేస్ట్ సినిమా. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి? అని ప్రశ్నించుకోవాలి ముందు. కథలో దమ్ము లేదు. అసలు ఈ సినిమాలో మెచ్చుకునే అంశాలు లేవనే చెప్పాలి. నవ్వించే కామెడీ సినిమా అనుకుంటాం…కానీ చెత్త కామెడీ. క్రైమ్ అనుకుంటే చెత్త వేస్ట్. థ్రిల్లర్ అనుకుంటే ఏమిటో ఆ థ్రిల్లర్ అనుకోవాల్సి ఉంటుంది.  ఎవరైనా థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూస్తే డబ్బు వేస్ట్. ఎందుకు ఈ సినిమా తీశారో సినిమా తీసిన వారే చెప్పాలి. ఈ సినిమాలో చెప్పుకోడానికి, గుర్తు పెట్టుకోడానికి, గొప్పగా చెప్పుకోడానికి ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే… ఈ సినిమా చూడాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని వెళ్లండి.

ఈ సినిమాలో శ్రీ సింహ, వెన్నెల కిశోర్, ఫరియా అబ్దుల్లా, సత్య నటించారు. ఈ సినిమా నిర్మాత చిరంజీవి(చెర్రి), దర్శకుడు, రచయిత రితేశ్ రాణా, సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫర్ సురేశ్ సరంగం, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్.

రేటింగ్: 2/5.

రివ్యూ: అశోక్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News