Saturday, December 21, 2024

గుండెపోటుకు గురైన వ్యక్తిని సకాలంలో కాపాడిన సిపిఆర్ చికిత్స!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని షాహీన్‌నగర్‌లో గుండెపోటుకు గురైన వ్యక్తిని ‘హెల్ప్ హ్యాండ్ ఫౌండేషన్ ’ ఆరోగ్య కేంద్రం డాక్టరు సకాలంలో చికిత్స అందించి కాపాడారు. 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. దాంతో ఆరోగ్య కేంద్రంలో వెంటనే కార్డియోపల్‌మోనరీ రీససిటేషన్(సిపిఆర్) చికిత్సనందించి డాక్టరు అతడిని కాపాడారు. తర్వాత 108 అంబులెన్స్‌లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. దీనికి ముందు ఆరామ్‌ఘఢ్ చౌరాస్తా వద్ద మరో వ్యక్తి కుప్పకూలాడు. అప్పుడు రాజేందర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రాజశేఖర్ సిపిఆర్ పద్ధతి ద్వారా అతడిని కాపాడాడు. ఆ ఘటన వీడియో కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది. దానిని మంత్రి హరీశ్ రావు కూడా మెచ్చుకున్నారు. భూపాల్‌పల్లి జిల్లాలో మరో పోలీసు కూడా ఓ వ్యక్తికి సిపిఆర్ చికిత్సనందించి కాపాడాడు. ఈ ఘటనలన్నీ సిపిఆర్ చాలా సాధారణ టెక్నిక్ అని, దాని ద్వారా గుండెపోటు వచ్చిన కొందరిని కాపాడవచ్చని తెలుస్తోంది. ప్రతి ఒకరు ఈ టెక్నిక్‌ను నేర్చుకోవాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News