Saturday, November 23, 2024

టిఫిన్ చేయంగనే టింగ్ టింగ్

- Advertisement -
- Advertisement -

సోమవారమే మీ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ
ఈ ఎన్నికల్లో మానుకోట పౌరుషాన్ని మళ్లీ చూపాలి
మహబూబాబాద్ రోడ్ షోలో వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: రైతులు సోమవారం టిఫిన్ చేసే సమయానికి వారి ఖాతాలో రైతుబంధు డబ్బులు పడి వారి మొబైళ్లు టింగు,టింగు అంటూ మోగుతాయని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులందరికీ సోనామసూరి బియ్యం అందజేస్తామని హరీశ్‌రావు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అశేష జనవాహిని నడుమ రోడ్ షో నిర్వహించారు. మానుకోటలోని వివేకానంద సెంటర్ నుంచి ప్రధాన వీధుల మీదుగా తహసీల్దార్ కార్యాలయం సెంటర్ వరకు రోడ్ షో సాగింది.

అనంతరం బిఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ అధ్యక్షతన జరిగిన రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సభలంటే ఖాళీ కుర్చీలే అని, మనం మీటింగు పెట్టుకుంటే ఇసుక వేస్తే రాలనంతగా జనసముద్రంగా మారుతుందన్నారు. మానుకోట అంటే తనకు ఎంతో ఇష్టమని, సమైక్యవాదుల దం డయాత్రను మానుకోట యువకులు తమ పౌరుషాన్ని చాటి మట్టి, రాళ్లతో తరిమికొట్టారన్నారు. అట్నుంచి బుల్లెట్లు దూసుకువస్తుంటే ఏమాత్రం వెరవకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారని, దెబ్బకు సమైక్యవాదులంతా పరార్ కావడం ఇక్కడికి మట్టికి ఉన్న పవర్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మళ్లీ ఆలోచన చేయాలని ఇ న్నాళ్లు లోపల ఉన్న సమైక్యవాదులంతా ఒక్కటవుతున్నారని మనం మానుకోట పౌ రుషాన్ని.. మహాత్యాన్ని ప్రదర్శించి వారికి దిమ్మతిరిగే విధంగా ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మానుకోటలో గులాబీ జెండే ఎగురకపోతే జిల్లాగా మారేదా, ఇక్కడ మెడికల్, ఇంజనీరింగ్, హర్టికల్చర్ డిగ్రీ కళాశాలలు వచ్చేవా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

గతంలో మానుకోటలో నీళ్లు లేవు.. విద్యా సంస్థలు లేవు, వైద్యం అందేది కాదని, తెలంగాణ వచ్చాక ఏం జరిగిందో.. ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధ్ది చెందిందో బేరీజు వేసుకోవాలని మానుకోట ప్రజలకు సూచించారు. మానుకోట రోడ్లు సిద్దపేట కంటే సుందరంగా తీర్చిదిద్దబడ్డాయన్నారు. కాలేశ్వరం నీరు ఇక్కడి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా పారడం వల్ల రెండు పంటలు పుష్కలంగా పండించుకుంటున్న పరిస్థితులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి కర్నాటక రాష్ట్ర ప్రజలు మోసపోయారన్నారు. అలాంటి పరిస్థితే మనకు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ మాయ మాటలు చెబుతు ముందుకు వస్తుందని అప్రమత్తంగా ఉండాలన్నారు. అక్కడ మూడు నాలుగు గంటలు కూడా రైతులకు కరెంటు ఇవ్వడం లేదని మనకు కూడా అన్ని గంటలే చాలు అంటున్న కాంగ్రెస్‌ను నమ్మి పోసవద్దని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మైన్ కుమారి అంగోతు బిందు, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, భీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, మార్నేని వెంకన్న, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మైన్ ఎండి. ఫరీద్, యూత్ అద్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మైన్ నాయిని రంజిత్, జడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ మౌనిక, డాక్టర్ సీతామహాలక్ష్మీ, వార్డు కౌన్సిలర్లు భోనగిరి గోపిరత్నంగంగాధర్, గోగుల అనురాధరాజు, గుండాస్వప్న పోతురాజు, గుగులోతు బాలునాయక్, చిట్యాల జనార్ధన్, సలీం, కర్పూరపు పద్మ, యాళ్లపుష్పలత, పార్టీనాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News