- Advertisement -
హైదరాబాద్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు మూడో రోజు కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. గతంలో ఈ సారి పట్టభద్రులు వేసిన ఓట్లు 25,824 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ఎంఎల్‌సి ఉప ఎన్నికలో 1,55,095 ఓట్లు వస్తే గెలిచినట్టు లెక్క. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 32,282 రెండో ప్రాధ్యాన్యత ఓట్లు వస్తే గెలిచే అవకాశం ఉంటుంది. బిఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి రెండో ప్రాధాన్యత ఓట్లు 50,847 వస్తే విజయం సాధించవచ్చును. మొత్తం 3,36,013 ఓట్లు పోలుకాగా చెల్లిన ఓట్లు 3,10,136గా ఉన్నాయి. ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్నకు 122,813 ఓట్లు రాగా బీఆర్ఎ స్ అభ్యర్ధి ఏనుగులు రాకే శ్ రెడ్డికి 1,04,348 ఓట్లు వచ్చాయి.
- Advertisement -