Monday, December 23, 2024

టిప్పర్ బైక్ ఢీ

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని వేముల ఘాట్ సమీపంలో శనివారం టిప్పర్, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బంజరు పల్లికి చెందిన ఇరుకోటి ప్రభాకర్(32) తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో తల పగిలిన ప్రభాకర్ పరిస్థితి పూర్తి విషమంగా మారటంతో వెంటనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.

ముట్రాజ్ పల్లి నుంచి వేముల ఘాట్‌కు బైక్‌పై వెళ్తున్న ప్రభాకర్‌ను వేగంగా అజాగ్రత్తగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. బంజరుపల్లికి చెందిన ప్రభాకర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభాకర్‌కు భార్య, ముగ్గరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News