Thursday, January 23, 2025

జాతీయ రహదారి 365 పై టిప్పర్ దగ్ధం

- Advertisement -
- Advertisement -

చివ్వెంల : షాట్ సర్కూట్‌తో టిప్పర్‌లో మంటలు వ్యాపించి దగ్ధం అయిన సంఘటన గురువారం సాయంత్రం మండల పరిధిలోని బండమీది చందుపట్ల నేషనల్ హైవే 365 పై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఐలాపురం నుండి చందుపట్ల గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన దాబాకు టిప్పర్‌లో మట్టి తరలిస్తుండగా చందుపట్ల గ్రామశివారులో

నేషన్ హైవే 365 పై రన్నింగ్‌లో ఉన్న టిప్పర్‌లో విద్యుత్ షార్ట్ సర్కూట్ అయి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ రవి అప్రమత్తమై వాహనం నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు ఫైర్ పోలీసుకు సమాచారం అందించడంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News