Tuesday, January 21, 2025

నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

టిప్పర్ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైహోం అవతార్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సుదీప్(27), గౌతం(27), శ్రీఈశ్వర్(27) సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ముగ్గురు తెల్లవారుజామున గచ్చిబౌలి నుంచి నార్సింగ్ మై హోమ్ అవతార్ మీదుగా ప్రయానిస్తుండగా లారీ వచ్చి వీరి కారును ఢీకొట్టింది. దీంతో ముగ్గురితో పాటు లారీ డ్రైవర్ సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి కారులో చిక్కుకున్న వారిని గంట పాటు శ్రమించి బయటికి తీశారు. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్షంగా మితిమీరిన వేగంతో నడపడంతో ప్రమాదానికి కారణమణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News