Thursday, December 26, 2024

టిప్పర్- లారీ ఢీ: వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: టిప్పర్- లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మద్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పటాన్ చెరు వైపు నుంచి సంగారెడ్డి వైపు జాతీయ రహదారిపై వెళ్తున్న టిప్పర్ ఇస్నాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొట్టింది. మృతుడిని  చిరంజీవి(25)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్రగాయాలై రెండు కాళ్లు విరిగిపోయాయి. పోలీసులు 108 అంబులెన్స్ వాహనంలో పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదైహాన్ని మార్చురీలో ఉంచడం జరిగిందని, వివరాలు తెలిన వారు పటాన్ చెరు పోలీసులను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News