Monday, December 23, 2024

బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లిదండ్రులతోపాటు కుమారుడి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతో సహా తనయుడు మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన కుమారుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. వివరాల్లోకి వెళితే.. భీమిని మండలం వెంకటాపూర్ కు చెందిన కోట తిరుపతి(40), తిరుమల(35), అంజేష్(18) ముగ్గురు మోటార్ సైకిల్ మీద తాండూరు మండలం బోయపల్లి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో భాగంగా ముగ్గురు బైక్ పై వస్తున్న సమయంలో బెల్లంపల్లి కన్నాల పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుండి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతి, తిరుమల అక్కడికక్కడే మృతి చెందగా, కొడుకు అంజేష్ తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ లారీ క్యాబిన్లో ఇరుక్కుని దాదాపు కిలోమీటరు వరకు ఈడ్చుకుంటూ వెళ్ళడంతో తీవ్రంగా గాయపడిన అంజేశ్ ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మంచిర్యాల ఆసుపత్రికి రిఫర్ చేయగా, మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన సంఘటన అందరిని కలచివేసింది. మృతుల బంధువుల రోధనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News