వాకింగ్ అనేది సరళమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాలలో ఒకటి. ఇది ఆర్యోగనికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా మానసిక తాజాదనాన్ని కూడా అందిస్తుంది. బరువు తగ్గడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు వాకింగ్ చేయాలి. రెగ్యులర్ వాకింగ్ శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచుతుంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు వాకింగ్ అలవాటును ఎలా పెంపొందించుకోవాలో మనం ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.
వాకింగ్ నిర్ణీత సమయంలో చేయాలి. మీ సమయాన్ని బట్టి ఉదయం లేదా సాయంత్రం నిర్ణయించుకోండి. వాకింగ్ ఉదయం చేయడం చాలా మంచిది. రోజంతా ఆక్టివ్ గా ఉంటాము. వాకింగ్ కి కంఫర్ట్ గా అనిపించే బట్టలు వేసుకోండి. ఇది ఎంతో సావకార్యవంతంగా ఉంటుంది.
వాకింగ్ 10-15 నిమిషాల నిడివితో ప్రారంభించండి. క్రమంగా సమయం, దూరాన్ని పెంచుకోండి. ఇది స్టామినాను పెంచడమే కాకుండా నడకను సులభతరం చేస్తుంది. వాకింగ్ కు స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేదా పొరుగువారిని తీసుకెళ్లండి. ఇది ఎంతో వినోదాన్ని పెంచుతుంది. ఇక భాగస్వామితో వెళ్తేయ్ మాత్రం ఒకరినొకరు ప్రేరేపిస్తుంది. మరింత ఆనందదాయకంగా ఉంటుంది.
వాకింగ్ చేసేందుకు పార్క్, గార్డెన్ లేదా లేక్‌సైడ్ వంటి సహజ వాతావరణం ఉన్న స్థలాన్ని ఎంచుకోండి. దీంతో అక్కడ ఉండే తాజా గాలి, పచ్చదనం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
వాకింగ్ చేస్తప్పుడు ప్రేరణాత్మక పోడ్‌కాస్ట్ లేదా పాటలను వినండి. ఇది వాకింగ్ సమయాన్ని ఆసక్తికరంగా మార్చడమే కాకుండా, ఎక్కువ సేపు నడవడానికి ప్రేరేపిస్తుంది. వాకింగ్ కు ముందు, తర్వాత నీరు త్రాగటం చాలా ముఖ్యం. ఇది ఎనర్జిటిక్‌గా ఉంచడమే కాకుండా డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది.