Wednesday, January 22, 2025

రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ టీజర్ విడుదల చేసిన దిల్ రాజు..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సోమవారం ఈ మూవీ టీజర్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు. అయితే, అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులే. పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి.

అందమైన ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఫన్, మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. తన వాళ్ళ కోసం తన మార్గాన్ని మార్చే అమాయక యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ నటించారు. హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించడంతోపాటు స్టంట్స్ కూడా చేసింది. మకరంద్ దేశ్‌పాండే విలన్ గా నటిస్తుండగా, మన్నారా చోప్రా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి జెబి సంగీతం అందిస్తున్నారు. జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News