- Advertisement -
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం తీరథ్ సింగ్ రావత్ చేత రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే సొంత పార్టీ నేతలతో విభేదాలు రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో బిజెపి పెద్దల నిర్ణయంతో పౌరీ నియోజకవర్గం నుంచి ఎంపిగా కొనసాగుతున్న తీరథ్ సింగ్ రావత్ ఈరోజు ఆ రాష్ట్ర సిఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తీరథ్ సింగ్ రావత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Tirath Singh Rawat sworn as Uttarakhand CM
- Advertisement -