Sunday, December 22, 2024

గాల్లో ఊడి పడిన విమానం టైరు… నుజ్జునుజ్జయిన కారు!

- Advertisement -
- Advertisement -

యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మరి కొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ కానుండగా, వెనుకవైపు ఉండే ల్యాండింగ్ గేర్ లోని ఒక టైరు గాల్లోనే ఊడి కింద పడిపోయింది. విమానాశ్రయంలోని పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కారుపై టైరు పడటంతో అది నుజ్జునుజ్జయింది. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బోయింగ్ 777-200 విమానం గురువారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోనుంచి ఒసాకో (జపాన్)కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

టైరు ఊడిపోయిన విషయాన్ని గమనించిన పైలెట్లు, విమానాన్ని లాస్ ఏంజెలిస్ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు విమానంలో 235మంది ప్రయాణికులు, 14మంది సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News