- Advertisement -
పల్లెవెలుగు బస్సు ప్రయాణికులకు తృటిలో ముప్పు తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తుండగా బస్సు నడుస్తుండగా చక్రాలు ఊడిపోయాయి. ఈ ప్రమాదలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెనుప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఓవర్ లోడ్ వల్లే బస్సు చక్రాలు ఊడిపోయినట్లు డ్రైవర్ తెలిపారు.
- Advertisement -