Tuesday, March 11, 2025

భద్రాచలం చేరుకున్న గవర్నర్

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి: మహా పట్టాభిషేకం మహోత్సవంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా  రాష్ట్ర గవర్నర్ సి పి రాధాకృష్ణన్ భద్రాచలం చేరుకున్నారు. ఐటిసి విశ్రాంతి భవనంలో గవర్నర్ కు పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. ప్రతి సంవత్సరం మహా పట్టాభిషేకం కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు గవర్నర్ రాధాకృష్ణన్ సమర్పిస్తారు. ప్రధాన ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మిథిలా మండపంలో శ్రీరామ చంద్ర స్వామిని దర్శించుకుంటారు. భద్రాద్రిలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మరో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. మిథిలా మండపంలో రాజాధిరాజుగా శ్రీరాముడు దర్శనమివ్వనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News