Thursday, January 23, 2025

శ్రీవారి అభిషేక సేవా టికెట్లు ఇప్పిస్తానని మోసం…

- Advertisement -
- Advertisement -

Tirumala Broker Cheats Devotees

అమరావతి: శ్రీవారి అభిషేక సేవా టికెట్లు ఇప్పిస్తానని నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన భక్తులకు దళారీ శరవణ మోసం చేశాడు. 9 అభిషేకం టికెట్లకు రూ.4.5లక్షలు గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేశారు. డబ్బులు బదిలీ చేసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయామని గుర్తించిన భక్తులు దళారిపై టిడిపి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదు మేరకు దళారీ శరవణపై మూడు కేసులు నమోదు చేశారు అధికారులు. శరవణపై మూడు కుటుంబాలు టిటిడి విజిలెన్స్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. టిటిడి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలలో భక్తులు దళారుల చేతుల్లో మోసపోతున్న ఘటనలు అనేకం జరుగుతున్న విషయం తెలిసిందే. దళారీలతో జాగ్రత్తగా ఉండాలని టిటిడి అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News