Wednesday, October 30, 2024

నవంబర్ 9 నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు యూరప్ లో శ్రీనివాస కళ్యాణాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: టిటిడి ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో యూకే, ఐర్లాండ్, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాష్ వెలగా, కృష్ణ జవాజీ జర్మనీ, ఫ్రాంక్‌ఫర్ట్ నుండి టిటిడి ఇఒ జె శ్యామలరావును మంగళవారం ఉదయం తిరుపతి పరిపాలన భవనంలోని ఇఒ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీనివాస కళ్యాణాలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.

అనంతరం వారు యూకే, ఐర్లాండ్‌, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 21 వరకు టిటిడి సహకారంతో స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి ఏపీ ఎన్ ఆర్ టీ ఎస్ శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇఒకు తెలిపారు. కాగా ఈ తిరు కళ్యాణ కార్యక్రమాలని టిటిడి వేదపండితులు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించనున్నారు.

యూకే, ఐర్లాండ్ మరియు ఐరోపాలలో శ్రీనివాస కళ్యాణాల వివరాలు:

• నవంబర్ 9 – బెల్ఫాస్ట్, ఐర్లాండ్

• నవంబర్ 10- డబ్లిన్, ఐర్లాండ్

• నవంబర్ 16- బేసింగ్‌స్టోక్, యూకే

• నవంబర్ 17 – ఐండ్‌హోవెన్, నెదర్లాండ్స్

• నవంబర్ 23- హాంబర్గ్, జర్మనీ

• నవంబర్ 24 – పారిస్, ఫ్రాన్స్

• నవంబర్ 30- వార్సా – పోలాండ్ –

• డిసెంబర్ 1 – స్టాక్‌హోమ్, స్వీడన్ –

•⁠ ⁠మిల్టన్ కీన్స్, యూకే – 7వ డిసెంబర్ 2024

• డిసెంబర్ 8 – గ్లౌసెస్టర్, యూకే.

• డిసెంబర్ 14 – ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ

• డిసెంబర్ 15- బెర్లిన్, జర్మనీ

• డిసెంబర్ 21. – జ్యూరిచ్, స్విట్జర్లాండ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News