Friday, January 10, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు నిండిపోవడంతో భక్తులు క్యూలైన్‌లో నిలిచి ఉన్నారు. భక్తుల దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గురువారం శ్రీవారిని 54,620 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.98 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. తిరుమలలో పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ జరుగనుంది. శుక్రవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మాడ వీధులలో వాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవను టిటిడి నిర్వహిస్తోంది.

Also Read: రక్తంతో తడిసిన వస్త్రాలతో సాయం కోసం మైనర్ బాలిక వేడుకోలు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News