- Advertisement -
తిరుపతి: తిరుమలలో అలిపి దగ్గర భక్తులకు రక్షణగా టిటిడి కర్రలు ఇస్తుంది. నడక మార్గంలో చిరుతను గుర్తించేందుకు 500 కెమెరాలు అమర్చారు. నడకమార్గంలో 30 మంది నిపుణుల బృందం పని చేస్తోంది. చిరుత కదలికలను గుర్తించి బోనులను ఏర్పాటు చేశారు. ఐదు రోజుల క్రితం బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. దీంతో తిరుమలకు నడక మార్గం ద్వారా వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పంద్యాల మడుగులో చిరుత సంచారం చేస్తోంది. ఆవుపై చిరుత దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read: విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు….
- Advertisement -