Monday, December 23, 2024

నేడు సాయంత్రం గరుడోత్సవం…..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీవార దర్శనం జరుగుతుంది. గురువారం గరుడోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను రద్దు చేశారు. 4000 మంది పోలీసులు, 1000 మంది టిటిడి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. గరుడోత్సవంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణగా మారింది. లక్ష్మీకాసులహారం, సహస్రనామ కాసుల హారం, నిత్యం మూలమూర్తికి అలంకరణలో ఉండే ఆభరణాలు గర్భాలయం దాటి వెలుపలికి రానున్నాయి. గ్యాలరీలో రెండు లక్షల మంది వాహన సేవలు వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువ అయితే అందరికీ గరుడోత్సవ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక క్యూలైన్ ద్వారా వెలుపల ఉన్నవారికి గరుడ వాహన దర్శనం కలుగనుంది. వాహన సేవలకు వచ్చే భక్తులకు ఆహారం వితరణ జరుగుతుంది. గురువారం రాత్రి 12 గంటలకు వరకు అన్నప్రసాద కేంద్రంలో అన్నదానం కార్యక్రమం జరుగనుంది. భక్తుల రద్దీ కారణంగా అరగంట ముందు గరుడోత్సవం ప్రారంభం కానుంది. సాయంత్రం 6.30 గంటలకే గరుడోత్సవం ప్రారంభం కానుంది. ప్రత్యేక దర్శనాలు, సర్వ దర్శనం టోకెన్లు రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News