Wednesday, January 22, 2025

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం: యువతి, యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల రెండో ఘాట్‌లో బస్సు-బైక్ ఢీకొనడంతో యువతీయువకుడు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడుకు చెందిన ఎస్ కార్తీక్(28) అనే యువకుడు, సౌమ్య అనే యువతితో కలిసి బైక్ పై తిరుమలకు వచ్చారు. బైక్‌పై తిరుమలకు వెళ్తుండగా రెండో ఘాట్ రోడ్డులో మూలమలుపు వద్ద అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు కిందపడ్డారు. వారి పైనుంచి బస్సు వెళ్లడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను రుయా ఆస్పత్రికి తరలించారు. ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అర గంట సేపు రాకపోకలు నిలిచిపోయాయని పోలీసులు వెల్లడించారు. కార్తీక్‌ది తిరువల్లూరు జిల్లా పల్లిపట్టి గ్రామం కాగా సౌమ్యది తిరువణ్ణుమలై జిల్లాలోని మషర్ గ్రామం అని పోలీసులు వెల్లడించారు. కార్తీక్‌కు నెల రోజుల్లో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రుల శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News