Sunday, December 22, 2024

నేతల చేతిలో రాజకీయ ‘లడ్డూ’!

- Advertisement -
- Advertisement -
కులతత్వంతో కూడిన ఆంధ్ర రాజకీయాల్లోకి మతతత్వ రాజకీయాలు ప్రవేశించాయ నేందుకు తిరుపతి ‘లడ్డు వివాదం’ తొలి సంకేతం. పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భార త్‌లో తొలి భాషాపరమైన రాష్ట్రంగా చరిత్ర పుస్తకాల్లో చోటు చేసుకున్నది. తెలుగు వారి పంథా అనుసరిస్తూ గుజరాతీలు, మహారా ష్ట్రీయులు, కన్నడిగులు, పంజాబీలు, ఇతర భాషా వర్గాలు భాష ప్రాతిపదికపై తమ సొంత పరిపాలన, రాజకీయ ప్రాంతాలు సాధించుకోగలిగారు. భాష ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి), ఆ సమయంలో భారత్‌లో ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఉమ్మడి వ్యూహం అనుసరించాయి. ఏళ్లు గడచిన తరువాత భాష ద్వారా ఏకమైన ప్రాంతాన్ని విభజిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదటి రౌండ్ చెదిరిపోయినప్పుడు ఎన్‌టి రామారావు తన పార్టీకి తెలుగు దేశం పార్టీ (టిడిపి) అని నామకరణం చేయడం ద్వారా భాషపరమైన మనోభావంతో తెలుగు వారిని మళ్లీ సమైక్యపరచే యత్నం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ(జెఎస్‌పి) అధిపతి పవన్ కల్యాణ్ ఒకప్పుడు లాటిన్ అమెరికన్ మార్కిస్ట్ హీరో, యువ దిగ్గజం చేగువేరా అభిమాని. పవన్ కల్యాణ్ ఇటీవలి వరకు ఎర్ర ఉత్తరీయం ధరించి, కమ్యూనిస్ట్‌లతో కలసి సాగుతూ తన మార్కిజం వల్ల లబ్ధి పొందారు. ఆయన అకస్మాత్తుగా కాషాయ ఉత్తరీయానికి మారారు. ఆయన ఇప్పుడు శంఖం పూరిస్తూ, తిరుపతి తిరుమల దేవస్థానం (టిటిడి) ఆలయంలో నెయ్యి కల్తీ వివాదాన్ని రాజకీయం చేస్తున్నారు.
నెయ్యికి సంబంధించి లోపభూయిష్ట నిర్వహణ జరిగిందా లేక దాని కొనుగోలులో ఉద్దేశపూర్వక అవినీతి చోటు చేసుకుందా అనే అంశం కాస్తా రాజకీయ మతపరమైన వివాదంగా మారింది. వ్యూహకర్త అయిన తన ఉప ముఖ్యమంత్రి కన్నా వెనుకబడరాదని భావించిన ఒకింత కలవరపాటుతో ఉన్న చంద్రబాబు నాయుడు మతపరమైన ప్రచారాన్ని తలకెత్తుకున్నారు. హిందు మనోభావాలను ఈ విధంగా అవమానించినందుకు ‘మైనారిటీల మిత్రుడు’ జగన్‌మోహన్ రెడ్డిని ఆయన నిందించారు.
మతపరమైన ఉద్రేకాలను లేవదీసినప్పుడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మిన్నకుండగలదా? హిందువుల నుంచి హిందుత్వను కాపాడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బిజెపి కార్యకర్తలు ముందుకు రాసాగారు. భగవంతుడు తనను, మానవులను రక్షించడంలో ఇక ఎంత మాత్రం ఆధారపడదగినవాడు కాదు. మానవులు, అందునా రాజకీయ పవర్ బ్రోకర్లు దేవుళ్లను కాపాడవలసిన అవసరం ఉంటున్నది. సమకాలీన రాజకీయ చరిత్ర లో మొట్టమొదటిసారిగా మతాన్ని ఆంధ్రుల కులతత్వ రాజకీయాల్లోకి తీసుకురావడమైంది.
ఈ మొత్తం వివాదం ఒక నివేదిక చుట్టూ తిరుగుతోంది. టిటిడి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగి ఉండవచ్చునని ఆ నివేదిక సూచించింది. ఇది ఏమీ కొత్త సమస్య కాదు. గతంలో నేతిలో వంటనూనెల కల్తీ జరిగిందని నమూనా పరీక్షలో బయటపడిన తరువాత అటువంటి సరకులను తిరస్కరించి, తిప్పిపంపుతుండేవారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ నెయ్యిలో అటువంటి నూనె కల్తీ గురించి పలు ఫిర్యాదులు దాఖలయ్యాయి. అయితే, ఈ ఏడాది ప్రప్రథమంగా అటువంటి కల్తీ మళ్లీ బహిర్గతమైనప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరింత ధ్రువీకరణ నిమిత్తం నెయ్యి శాంపిల్‌ను గుజరాత్ కేంద్రంగా గల జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి మండలి (ఎన్‌డిడిబి)కి పంపింది.
నెయ్యిలో వంటనూనె కల్తీ జరిగిందని ఎన్‌డిడిబి విశ్లేషణ సూచించింది. అయితే, ఈ వివాదంలో ఆసక్తికరమైన కొత్త మలుపు ఏమిటంటే, ఒక అసాధారణ చర్యగా ‘జంతు కొవ్వు లక్షణాలు కనిపిస్తుండే అవకాశం’ ఉందని బోర్డు తన నివేదికలో ఒక లైన్ చేర్చడం. జంతువుల కొవ్వు ఏదైనా ఉన్నట్లుగా నిర్ధారించేందుకు ఎటువంటి ఆధారాన్నీ ఇంత వరకు చూపలేదు. అటువంటి కల్తీ అవకాశం ఉందని సూచించడం అటువంటి కల్తీ జరిగిందని ధ్రువీకరించేందుకు కాదు. మరి ఎటువంటి ఆధారాన్నీ చూపకుండా ఈ ‘అవకాశం’ ఉందని సూచించడం అవసరమని ఎన్‌డిడిబి ఎందుకు భావించిందో సమాధానం రావలసిన ప్రశ్న.
రాజకీయ నాయకులు మతతత్వ కొలిమి రాజేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు అటువంటి విషయాలను పట్టించుకోవడం ఎందుకు? హిందు మనోభావాలను కించపరచారని ఆరోపించడం ద్వారా తన విరోధి జగన్‌మోహన్ రెడ్డిని (జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవ మతస్థుడన్నది గుర్తుంచుకోండి) దెబ్బ తీసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, బిజెపికి మరింతర సన్నిహితుడై, నాయుడుపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుండవచ్చు. నాయుడు కుమారుడు నారా లోకేష్ ఉత్థానాన్ని అడ్డుకుంటూ, ఆంధ్ర రాజకీయాల్లో తన ప్రతిపత్తిని సుదృఢం చేసుకునేందుకు పవర్ కల్యాణ్ రాజకీయ క్రీడ ఆడుతున్నారు. మూడు కూటమి భాగస్వామ్య పక్షాలు టిడిపి, బిజెపి, జెఎస్‌పి పాత్ర ఉన్న అధికార రాజకీయ క్రీడలో తిరుపతి లడ్డు రాజకీయ బంతిగా మారింది.
కుల తత్వంతో కూడిన ఆంధ్ర రాజకీయాల్లోకి మతతత్వ రాజకీయాలు ప్రవేశించాయనేందుకు తిరుపతి ‘లడ్డు వివాదం’ తొలి సంకేతం. పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత్‌లో తొలి భాషాపరమైన రాష్ట్రంగా చరిత్ర పుస్తకాల్లో చోటు చేసుకున్నది. తెలుగు వారి పంథా అనుసరిస్తూ గుజరాతీలు, మహారాష్ట్రీయులు, కన్నడిగులు, పంజాబీలు, ఇతర భాషా వర్గాలు భాష ప్రాతిపదికపై తమ సొంత పరిపాలన, రాజకీయ ప్రాంతాలు సాధించుకోగలిగారు. భాష ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి), ఆ సమయంలో భారత్‌లో ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఉమ్మడి వ్యూహం అనుసరించాయి.
ఏళ్లు గడచిన తరువాత భాష ద్వారా ఏకమైన ప్రాంతాన్ని విభజిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదటి రౌండ్ చెదిరిపోయినప్పుడు ఎన్‌టి రామారావు తన పార్టీకి తెలుగు దేశం పార్టీ (టిడిపి) అని నామకరణం చేయడం ద్వారా భాషపరమైన మనోభావంతో తెలుగు వారిని మళ్లీ సమైక్యపరచే యత్నం చేశారు. నేషనల్ ఫ్రంట్ పేరిట అఖిల భారత రాజకీయ కూటమికి ఎన్‌టిఆర్ అధినేత అయినప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం జాతీయ స్థాయిలో పుంజుకున్నది. పివి నరసింహారావు దక్షిణాది నుంచి భారత తొలి ప్రధాని అయినప్పుడు ఆ భావన మళ్లీ ప్రాచుర్యం పొందింది. ఎన్‌టిఆర్, పివిఎన్‌ఆర్ ఉభయులూ అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించిన సెక్యులర్ నేతలు. మతతత్వ రాజకీయాలు రాష్ట్రంలో వేళ్లూనుకోవడానికి వారిలో ఎవ్వరూ అనుమతించలేదు.
జనాన్ని సమైక్యంగా కట్టిపడేసే భాష సామర్థం కుల రాజకీయాల రంగ ప్రవేశంతో దుర్బలమైంది. తెలుగు ప్రముఖులు రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, రాజు మధ్య అధికారం, సంపద కోసం పోరాటం తెలుగు రాజకీయాల్లో కులం ప్రాముఖ్యం పెరగడానికి దోహదం చేసింది. తెలంగాణ కొత్త రాష్ట్రంలో ప్రముఖుల మధ్య రాజకీయ విభజన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)పై ఆధిపత్యం ఉన్న వెలమలు, కాంగ్రెస్ పార్టీలో తిరిగి సారథ్యం సాధించిన రెడ్ల మధ్య కానవచ్చింది. కుదించుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పోరు రెడ్డి ఆధిపత్యం గల వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కమ్మ ప్రాబల్యం గల టిడిపి మధ్య సాగుతోంది.
ఈ కుల ఆధారిత రాజకీయ రంగంలో బిజెపి తన పకడ్బందీ మతతత్వ రాజకీయాలతో ప్రవేశించింది. భూస్వాములు హైదరాబాద్ నిజాముల ఆధిపత్యం రోజుల నాటి హిందుముస్లిం విభజన చరిత్ర దృష్టా బిజెపి తెలంగాణలో సులభంగానే ప్రవేశించగలిగింది. సమైక్య ఎపిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్థానిక విభాగంలో రాజకీయ కుమ్ములాటల్లో భాగంగా ఈ అంతర్గత మతపరమైన ఉద్రిక్తతలను ఉపయోగించుకున్నది. రాజకీయాల్లో మతతత్వ ప్రాబల్యం క్షీణతకు ఎన్‌టిఆర్ శకం దోహదం చేసింది. కానీ, గడిచిన దశాబ్దంలో జాతీయ స్థాయిలో బిజెపి ఉత్థానంతో మతం తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రవేశించింది.తెలంగాణలో రాజకీయాలు ఎల్లప్పుడూ మతపరమైన ధోరణిలోనే సాగగా, ఆంధ్ర ప్రాంతం చాలా వరకు ఆ ప్రభావానికి దూరంగా ఉన్నది. ఆంధ్ర ప్రాంతంలో కూడా ముస్లిం మైనారిటీలు స్థానిక సాంఘిక, సాంస్కృతిక జీవనంలో మరింతగా మిళితమైపోయారు. ఇంకా ఉన్నత వర్గం ముస్లింలలో అనేక మంది తెలుగును సులభంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ తెలంగాణలోని ముస్లింలలో అధిక సంఖ్యాకులు ఆ భాష మాట్లాడేందుకు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ఇద్దరూ అభివృద్ధి, సంక్షేమంవైపే దృష్టి కేంద్రీకరించారు. వారు మత జ్వాలలు రగిల్చేందుకు ఇంత వరకు ఆసక్తి చూపలేదు. బిజెపి ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉండగా, కృత్రిమ మార్కిజం నుంచి కృత్రిమ మతతత్వానికి పవన్ కల్యాణ్ మారడం ఒక విధమైన విరక్తితో స్వప్రయోజనం కోసం వేసిన రాజకీయ పిల్లిమొగ్గ కావచ్చు. ఈ వివాదం అంతం అవుతుందా లేక తెలుగు రాజకీయాలను మతతత్వంగా మారుస్తుందా అనేది వేచి చూడవలసి ఉంటుంది.

సంజయ్ బారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News