తిరుమల: చిన్నారి లక్షితపై దాడి చేశాక టిటిడి అనేక చర్యలు తీసుకుందని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నడకదారిలో ఆరో చిరుత బోనులో చిక్కుకోవడంతో ఆ ప్రాంతానికి టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నడకదారి భక్తులకు టిటిడి భద్రత కట్టుదిట్టం చేసిందని, అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సూచనలన్నీ అమలు చేస్తున్నామని, నడకదారిలో భక్తులకు ఊతకర్రలు అందించామని, భవిష్యత్తులో మరింత భద్రత కల్పిస్తామని కరుణాకర్ రెడ్డి చెప్పారు. నడకదారిలో కంచె వెయ్యడమాలేక కాదని, జంతువుల సంచారానికి మార్గం సుగుమం చేయడానికి ఏర్పాట్లు చేశామని, విమర్శలు చేసేవారికి కనువిప్పు కలగాలని చురకలంటించారు. టిటిడి చేపడుతున్న చర్యల కారణంగానే ఆరు చిరుతలను బంధించామని, కూరమృగాల సంచారంపై నిరంతరం అధ్యయనం జరుగుతుందని వివరించారు.
Also Read: రుషి పత్నులకు నీలాపనిందలు