- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. క్యూలైన్ లేకుండానే నేరుగా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 66,312 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.7 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. ఈ నెల 18న పుష్పయాగానికి అంకురార్పణ జరగనుంది. ఈ నెల 19న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం జరుగుతుంది. పుష్పయాగం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ జరగనుంది. డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ దర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
- Advertisement -