- Advertisement -
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. కార్తీక మాసం సందర్భంగా గత రెండు రోజులు తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే, మంగళవారం భక్తుల రద్దీ కాస్తా తగ్గింది. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 8 గంటల సమయం పడుతోంది.
ఇక, సోమవారం 74,651 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 24,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -