Wednesday, January 22, 2025

శ్రీవారి భక్తులకు శుభవార్త…

- Advertisement -
- Advertisement -

tirumala online darshan tickets release

అమరావతి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఇవాళ ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఏకంగా..ఏప్రిల్ మాసానికి సంబంధించిన టికెట్లు, రేపు మే మాసం..ఎల్లుండి జూన్ మాసంకు సంభందించిన టికెట్లను విడుదల చేయనుంది. సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30 వేల చొప్పున.. గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకి 25 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేయనుంది. 3 నెలలకు సంభందించి 25 లక్షల టికెట్లు విక్రయం ద్వారా టిటిడి ఖజానాకు ఏకంగా రూ.75 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ఇక టీటీడీ పాలక మండలి.. తాజా ప్రకటన తో… భక్తులు ఫుల్‌ ఖుషీ లో ఉన్నారు. కాగా.. నిన్న శ్రీవారిని 72,265 మంది భక్తులు దర్శించుకు కోగా.. తలనీలాలు 34,517 మంది భక్తులు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం రూ.4.59 కోట్లకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News