తిరుమల: తిరుమల శ్రీవారిని మంగళవారం 27,167 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారికి 13,247మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.95 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. అక్టోబర్ 7 నుంచి 15వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రోజుకు 500 నుంచి 1000మంది భక్తులకు ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టిటిడి వెల్లడించింది. భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే నెగెటీవ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.
Tirumala Srivari Annual Brahmotsavam begins on Oct 5th