Friday, November 15, 2024

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమాచారం..

- Advertisement -
- Advertisement -

Tirumala Srivari Brahmotsavam on Oct 7th to 15th

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 29,524 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 12,183 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.74 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ రోజు విఐపి దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి సాయంత్రం ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ చేయ‌నున్నారు.

ఈనెల 7న మీనలగ్నంలో సాయంత్రం 5.10 గంటలకు ధ్వ‌జారోహ‌ణం, రాత్రికి పెద్ద‌శేష వాహ‌న‌ సేవతో శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ప్రారంభించనున్నారు. 8న ఉదయం చిన్న‌శేష వాహ‌న‌ సేవ‌, రాత్రికి హంస వాహ‌న‌సేవ‌ చేయనున్నారు. 9న ఉదయం సింహ వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నపనతీరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల సమయంలో ముత్య‌పు పందిరిపై స్వామివారు అభయమివ్వనున్నారు.10న ఉదయం క‌ల్ప‌వృక్ష‌ వాహనంపై, రాత్రి స‌ర్వ‌భూపాల వాహ‌నంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. 11న ఉదయం మోహినీ అవ‌తారంలో, రాత్రి గ‌రుడ వాహ‌న‌ంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.12న ఉదయం హ‌నుమంత వాహనంపై, రాత్రి గ‌జ వాహ‌న‌ంపై స్వామివారు దర్శనమి వ్వనున్నారు. 13న ఉదయం సూర్య‌ప్ర‌భ వాహనంపై, రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌న‌ంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. 14న ఉదయం స‌ర్వ‌భూపాల‌ వాహనంపై, అశ్వ వాహ‌న‌ంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.15న రాత్రి ధ్వ‌జారోహ‌ణ‌ంతో స్వామివారు బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Tirumala Srivari Brahmotsavam on Oct 7th to 15th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News