Monday, December 23, 2024

రేపు తిరుమలలో శ్రీవారి ప్రణయకలహోత్సవం..

- Advertisement -
- Advertisement -

Huge Devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 18న వైభవంగా జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గంటల తర్వాత స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనున్నారు.

Tirumala srivari Pranayakala Utsavam on Jan 18

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News