- Advertisement -
తిరుపతి: అక్టోబరు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏకాంతంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. 7వ తేదీ ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకాగా అదే రాత్రి పెద్ద శేషవాహనం శ్రీవారిని ఊరేగిస్తారు.
8వ తేదీ ఉదయం చిన్నశేషవాహనం, రాత్రి హంస వాహనం
9వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
10వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
11వ తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ సేవ
12వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం, రాత్రి గజవాహనం.
13వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
14వ తేదీ ఉదయం రథం బదులుగా సర్వభూపాల వాహనం,రాత్రి అశ్వవాహనం
15న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
- Advertisement -