Sunday, October 6, 2024

తిరుమల వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈక్రమంలో టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.

ఆదివారం శ్రీవారిని 83,740 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 35,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News