- Advertisement -
తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తరలిస్తున్నారు. దీంతో వెంకన్న సర్వదర్శనానికి మంగళవారం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. భక్తులు తమ తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
సోమవారం శ్రీవారిని 69,314 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,021మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమలలో శ్రీవారం హుండీ ఆదాయం రూ.5.48 కోట్లు వచ్చినట్లు టిటిడి వెల్లడించింది.
- Advertisement -