- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. గురువారం వెంకన్న సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందకు 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు వెంకన్నను దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు.
కాగా, బుధవారం శ్రీవారిని 66,915 మంది భక్తులు దర్శించుకోగా.. 24,667 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -