Sunday, January 19, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా భక్తులు శ్రీవారి దర్శించుకుంటున్నారు. మంగళవారం శ్రీవారిని 67,616 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 22,759 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. కాగా, సెప్టెంబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌రకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News