- Advertisement -
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది.
శనివారం శ్రీవారిని 78,686 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 37,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -