Sunday, December 22, 2024

తిరుమలలో 31 కంపార్టుమెంట్లు ఫుల్.. దర్శనానికి 16 గంటలు

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వెంకన్నను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి16 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక, ఆదివారం శ్రీవారిని 81,744 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 36,833 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

కాగా, ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం ఉత్సవాలు జరపనున్నారు ఇక, 22న పౌర్ణమి గరుడ వాహన సేవ ఉండనుంది. రాత్రి 7గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News