Monday, April 28, 2025

నేరుగా శ్రీవారి దర్శనం

- Advertisement -
- Advertisement -

తిరుమల : వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు భక్తులు. ఆదివారం శ్రీవారిని 66,598 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,103 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్లు. కొనసాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు సాయంత్రం శ్రీ మలయప్ప వెన్నెముద్ద కృష్ణ అలంకారంగా దర్శనమిచ్చి తన భక్తులను అనుగ్రహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 6.55 గంటలకు రథోత్సవం. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనసేవ చేపట్టనున్నట్లు తిరుమల అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News